రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన' కార్యక్రమానికి ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులు వీరే..

  • హైదరాబాద్ - కె. నిర్మల.
  • వరంగల్ - వాకాటి కరుణ.
  • కరీంనగర్ - శ్రీదేవసేన.
  • మహబూబ్నగర్ - టి.కె. శ్రీదేవి.
  • ఖమ్మం ఎం.రఘునందన్రావు.
  • రంగారెడ్డి - ఇ.శ్రీధర్.
  • మెదక్ ఎస్.సంగీత.
  • ఆదిలాబాద్ - ఎం. ప్రశాంతి.
  • నల్గొండ - ఆర్.వి. కర్ణన్.
  • నిజామాబాద్ - క్రిస్టినాను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.